ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నా... కొనాలన్నా... ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటిపట్టునే కూర్చుని నెట్లో వెతికేస్తే! ఆ వీలు కలిగించేదే http://housing.com/inప్రధాన నగరాల్లోని ప్రాంతాల్ని బ్రౌజ్ చేసి నచ్చిన ఇంటిని ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు Hyderabadని సెలెక్ట్ చేస్తే Rent, Buy ట్యాబ్ విండోలతో పేజీ వస్తుంది. అక్కడ కనిపించే search బాక్స్‌లో ఏ లొకేషన్‌లో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారో ENTER చేయాలి. మ్యాపింగ్‌తో అందుబాటులో ఉన్న అన్ని ఇళ్లు, అపార్ట్‌మెంట్‌ల వివరాలు కనిపిస్తాయి. సింగిల్ బెడ్‌రూం, డబుల్, త్రిబుల్... విభాగాలు ఉన్నాయి. కావాల్సిన ఇంటి ఫొటోలు, ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. ఇంటికి దగ్గర్లో ఉన్న రవాణా సౌకర్యాలు, షాపింగ్ మాల్స్, పాఠశాలలు, ఆసుపత్రులు ఏమేం ఉన్నాయో చూడొచ్చు. ఇల్లు నచ్చితే సంబంధిత వ్యక్తిని కాంటాక్ట్ చేయవచ్చు. 'ఫిల్టర్స్' మెనూలోకి వెళ్లి కావాల్సిన సౌకర్యాలతో ఇళ్లను వెతికే వీలుంది.
No comments:
Post a Comment