Sunday, April 13, 2014

TIPS.

బ్రౌజింగ్‌లో అనుకోకుండా క్లోజ్‌ చేసిన ట్యాబ్‌ని తిరిగి పొందాలంటే? మెనూల్లో ఆప్షన్లు మామూలే. షార్ట్‌కట్‌తో తిరిగి పొందొచ్చు. అందుకు Ctrl+Shift+Tనొక్కండి.

ఏదైనా వెబ్‌కి సంబంధించిన 'సోర్స్‌ డేటా'ని చూడాలంటే పేజీలో లోపల రైట్‌క్లిక్‌ చేసి View Page Source, View Page Info చూడొచ్చు.

వెబ్‌ విహారంలో చూసే సైట్‌ల్లో ఏవి నమ్మదగినవి, ఏవి మోసపూరితమైనవో తెలుసుకోవాలంటే? ఫైర్‌ఫాక్స్‌లో ప్రత్యేకWOT యాడ్‌ఆన్‌ ఉంది. నెటిజన్లు ఇచ్చిన ర్యాంకింగ్‌ ఆధారంగా ఆయా సైట్‌లకు ఉన్న ప్రాధాన్యతని తెలుసుకోవచ్చు. ADD ONS

ఏదైనా సైట్‌లోకి వెళ్లాలంటే మొత్తం యూఆర్‌ఎల్‌ లింక్‌ టైప్‌ చేయక్కర్లేదు. ఎందుకంటే ఆ పని Omnibar చేసేస్తుంది. OMNIBAR

బ్రౌజింగ్‌లో ఆసక్తికరమైన సమాచారం చాలానే కనిపిస్తుంది. పూర్తిగా చదివేంత తీరిక లేకపోతే వాటిని మార్క్‌ చేసి భద్రంగా పెట్టుకుని వీలున్నప్పుడు చదవొచ్చు. అందుకు అనువైన సర్వీసే Pocket.పీసీ, ఫోన్‌, ట్యాబ్లెట్‌ల్లో వాడుకోవచ్చు. POCKET

ఫైర్‌ఫాక్స్‌ వేదిక పైన బ్రౌజింగ్‌లో ఎంత సమయం వెచ్చిస్తున్నారో ట్రాకింగ్‌ ద్వారా తెలుసుకోవాలంటే Time Tracker యాడ్‌ఆన్‌ని వాడొచ్చు. పాత వెర్షన్‌లోనే ఇది పని చేస్తుంది. Time Traker

No comments:

Post a Comment