Friday, December 21, 2012
Saturday, December 15, 2012
Tuesday, December 11, 2012
COURIER స్టేటస్ తెలుసుకోవడానికి
PROFESSIONAL COURIERS వాడేవారు, ఏదయినా పార్సిల్ గాని , డాక్యుమెంట్ గాని పంపించినట్లయితే అది అవతలివారికి డెలవరి చేయబడిందా, లేదా దాని స్టేటస్ ఏమిటి అన్నది తెలుసుకోవడానికి ఈ సైట్ http://www.tpcindia.com/ ఉపయోగపడుతుంది.
Monday, December 10, 2012
Facebook password మార్చబడింది.
సెక్యూరిటీ జాగ్రత్తలలో భాగంగా మీ Facebook password మార్చడం జరిగింది. "ఈ క్రింది attachments లో మీ కొత్త password ఉంటుంది" అంటూ ఏదయినా మెయిల్ వస్తే ఎట్టి పరిస్తితుల్లోను దాని attachment ని open చేయకండి. అందులో ప్రమాదకరమైన trojan దాగి ఉంది. Facebook .zip పేరుతొ 25 size గల attachment వస్తుంది.
ఈ క్రింది చూపించిన విధంగా message ఉంటుంది
Subject: Facebook Password Reset Confirmation! Your Support.
Dear user of facebook,
Because of the measures taken to provide safety to our clients, your password has been changed. You can find your new password in attached document.
Thanks,
Your Facebook.
ఎండాకాలం లో వర్షాన్ని ఎంజాయ్ చెయ్యాలని ఉందా ?
http://www.rainymood.com/అనే సైట్ కి వెళ్లి వర్షం పడుతున్న శబ్దాన్ని, ఉరుములు , మెరుపుల శబ్దాలను వింటూ వర్షాకాలం లో ఉన్న అనుభూతిని పొందవచ్చు. వాతావరణం ఎటూ మార్చలేం కదా....?
White Background సరిగ్గా లభించలేదా?
మీరు తీసిన photo లో (లేదా) scan చేసిన documents లో white background ఉండాల్సింది పోయి gray colors sheddings తో సరిగ్గా కనిపించకపొతే http://fotofuze.com/ అనే సైట్ లో Account create చేసుకుని , ఫోటోలను upload చేసుకుని వాటి back ground మార్చవచ్చును.
observer the below photos
observer the below photos
Sunday, December 9, 2012
Saturday, December 8, 2012
Microsoft word లో లైన్స్ కోసం
Microsoft word లో లైన్స్ కావాలా?
Hyphen (-) అనే గుర్తు ని మూడు సార్లు టైపు చేసి ENTER కీ ని ప్రెస్ చేస్తే మీకు FULL లైన్ Display అవుతుంది. example ---
అదేవిధంగా tilde (~) అనే గుర్తు ని మూడు సార్లు టైపు చేసి ENTER కీ ని ప్రెస్ చేసి చూడండి. example ~~~
అదేవిధంగా astric (*) అనే గుర్తు ని మూడు సార్లు టైపు చేసి ENTER కీ ని ప్రెస్ చేసి చూడండి. example ***
అదేవిధంగా Numbersign (#) అనే గుర్తు ని మూడు సార్లు టైపు చేసి ENTER కీ ని ప్రెస్ చేసి చూడండి. example ###
Friday, December 7, 2012
Wednesday, December 5, 2012
Thursday, April 12, 2012
Wednesday, April 11, 2012
కంటి పరీక్ష చార్టుల్లో 'E' అన్న అక్షరాన్ని ఎందుకు ప్రారంభంలో ఉంచుతారు?
150 సంవత్సరాల క్రితం కంటి పరీక్షలో మొదటి పెద్ద అక్షరంగా A ఉండేది. త్వరలోనే అది E గా మారింది. మూడు నల్ల అడ్డగీతల మధ్య సమానమైన తెల్ల ఖాళీ స్థలం ఉండటం వల్ల ఆ అక్షరానికి ప్రదమస్థానం ఇవ్వడం జరిగింది.
Monday, March 26, 2012
Sunday, March 25, 2012
Saturday, March 24, 2012
Sunday, March 18, 2012
చిన్ని ప్రశ్నలు
1)ప్రశ్న ఉక్కు ఎందుకు తుప్పు పట్టదు ?
సమాధానం ఉక్కులో 20% క్రోమియం కలపడం వలన తుప్పు పట్టదు .
2)ప్రశ్న సూర్యుడు నిరంతరం మండటానికి తోడ్పడే ఇంధనం ఏది ?
సమాధానం hydrozen
3)ప్రశ్న మిణుగురు పురుగులు నుండి మిణుకుమంటూ వెలుతురు రావడానికి కారణం ?
సమాధానం "లూసిఫెరిన్" అనే ఒక రసాయనం వలన
4)ప్రశ్న మెదడు చుట్టూ ౩ పొరలు ఉంటాయి. వాటిని ఏమంటారు ?
సమాధానం మెనింజిస్
5)ప్రశ్న అప్పుడే పుట్టిన శిశువు గుండె నిమిషానికి ఎన్ని సార్లు కొట్టుకుంటుంది.
సమాధానం 130 - 140
6)ప్రశ్న గోర్లు వెంట్రుకలు ఏ ప్రోటీన్ పదార్ధం తో ఏర్పడతాయి ?
సమాధానం కెరోటిన్
7)ప్రశ్న భారతదేశం ఎన్ని దేశాలతో సరిహద్దును కలిగి ఉంది ?
సమాధానం 7
8)ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది ?
సమాధానం 5 రాష్ట్రాలు , ఒక కేంద్రపాలిత ప్రాంతం
9)ప్రశ్న ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు ?
సమాధానం 970km
10)ప్రశ్న భారతదేశం తీర రేఖ పొడవు ?
సమాధానం 7516km
11)ప్రశ్న కంప్యూటర్ లో ఉండే చిప్స్ ను దేనితో తయారు చేస్తారు ?
సమాధానం సిలికాన్
12)ప్రశ్న ఆక్సిజన్ ను కనుగొన్న శాస్త్రవేత్త ?
సమాధానం Priestley
13)ప్రశ్న రక్తం లో చక్కెరను అదుపులో ఉంచే హార్మోన్ ?
సమాధానం ఇన్సులిన్
14)ప్రశ్న భూమికి సూర్యుడికి మధ్య ఉన్న సగటు దూరం ?
సమాధానం 149598500km
15)ప్రశ్న సూర్యుడి బరువు భూమి కంటే ఎంత ఎక్కువ ?
సమాధానం 333000 రెట్లు
16)ప్రశ్న మానవునిలో ఉండే కండరాల సంఖ్య సుమారుగా ?
సమాధానం 600
17)ప్రశ్న మానవుని ఒక చేతిలో ఎన్ని ఎముకలు ఉంటాయి ?
సమాధానం 30
18)ప్రశ్న మనం ఇప్పుడు వాడుతున్న క్యాలెండర్ ?
సమాధానం గ్రెగోరియన్ క్యాలెండర్
19)ప్రశ్న ’సారే జహాసే అచ్చా’ గీతం ఏ బాషలో ఉంది ?
సమాధానం ఉర్దూ
20)ప్రశ్న జనగణమన గీతంలో "ద్రావిడ" అనే మాటకు అర్ధం ?
సమాధానం ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు , కేరళ , కర్ణాటక
21)ప్రశ్న గాలిలో ఎగిరే balloon లో ఏ వాయువు ఉంటుంది ?
సమాధానం హీలియం
Tuesday, March 13, 2012
జాతీయ వారసత్వ జంతువుగా ఏనుగు
భారతీయ సంప్రదాయంలో విశిష్ట స్థానం కలిగిన గజరాజుకు జాతీయ జంతువుగా గుర్తింపు లభించింది. దేశంలో అంతరించిపోతున్న ఏనుగులను సంరక్షించాలన్న యోచనతో కేంద్ర ప్రభుత్వం 2010, october 22న ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. ఏనుగును జాతీయ సాంప్రదాయ జంతువుగా ప్రకటిస్తూ పర్యావరణ మంత్రిత్వశాఖ ఓ notification జారీచేసింది. దీంతో జాతీయ జంతువుగా పులిని గుర్తించినట్టుగానే ఏనుగును కూడా జాతీయ జంతువుగా గుర్తించాలన్న డిమాండ్ ఇన్నాళ్ళకు నేరవేరినట్టైంది.
Thursday, March 8, 2012
Wednesday, March 7, 2012
Tuesday, March 6, 2012
Monday, March 5, 2012
విధివిధానమును తప్పించగను... ఎవరు సాహసించెదరు
అంతానేనే , అంతానాదే, నా గొప్పతనమే నా విజయాలకు కారణం అంటూ ... మీసాలు మెలివేసే ఎందరో ఒక్కటంటే ఒక్క దెబ్బ జీవితంలో గట్టిగా తగిలిందంటే చాలు.... వెంటనే వారి నోటివెంట వచ్చే పదం ’విధి’.
ఎంతటివారయినా.... ఆ విధిని తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. విధిరాత కాకపోతే .....అందంగా నీరు విరజిమ్ముతూ ....ఎందరినేత్రాలకో మహదానందాన్ని, ఎందరి మనసులలో మహోల్లాసాన్నిఅందించే అతిసాధారణ వాటర్ ఫౌంటైన్... ఓ ఆడపిల్ల జీవితాన్ని దుర్భర పరిస్థితిలోకి దొర్లించడం ఏమిటి? రేపు ఆమె వివాహానికి అర్హురాలా అన్నంతగా... ఆమె జీవితాన్ని కాలరాచిన ఈ వింత ఉదంతం మిమ్మల్ని తప్పకుండా ఆకర్షిస్తుంది. ఇక్కడి చిత్రంలో మీరు చూస్తున్నది ... చైనాకు చెందిన టియాన్ స్క్వేర్లోని వాటర్ ఫౌంటైన్ . ఎంత అందంగా ఉందో చూపరులకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో గమనించారుగా. ఈ స్విమ్మింగ్ ఫూల్ ఓ 19 సంవత్సరాల యువతి జీవితంలో నిప్పులు చెరిగింది.19 సంవత్సరాల ఆ యువతి పేరు యాంగ్. ఫ్రెండ్స్ తో కలిసి ఈ వాటర్ ఫౌంటెయిన్ ను ఎంజాయ్ చేస్తుంది. ఇది మ్యూజికల్ వాటర్ ఫౌంటెయిన్ కావడంతో ....ఎక్కువగా యువతి యువకులు ఇక్కడకు వస్తుంటారు. వాటర్ ఫౌంటెయిన్ లోకి దిగి ...సన్నగా నీటిని విరజిమ్ముతున్న ఫౌంటెయిన్ నీటి జల్లుల్లో చల్లగా తడుస్తూ ...హ్యాపీగా కేరింతలు కొడుతున్నారు ...... యాంగ్,ఆమె స్నేహితులు. హఠాత్తుగా కాళ్ళక్రింద భూమి బద్దలయిందా అన్నట్లుగా..... యాంగ్ కాళ్ళ క్రిందనున్న అతి పవర్ ఫుల్ ఫౌంటెయిన్ ఒక్కసారిగా నీరు విరజిమ్మడం .... ఆ వేగానికి యాంగ్ గాలిలోకి లేచి క్రిందపడిపోవడం జరిగింది.
ఏమి జరిగిందో అర్ధం చేసుకునేలో గానే పెద్ద అనర్దం జరిగిపోయింది. ఆమె శరీరం నుండి రక్తం ధారలుగా కారిపోతుంది. దీనికి కారణం ...యాంగ్ గాలిలోకి లేచి క్రింద పడిపోవడం కాదు. వాటర్ ఏకంగా ఆమె మర్మావయువం లోంచి ఆమె ప్రేగుల్లోకి దూసుకు వెళ్లాయ్. మర్మావయవం చినిగిపోయి ... ప్రేవులు కూడా డ్యామేజ్ కావడంతో ....రక్తం కాలువలు కట్టింది . తక్షణం హాస్పటల్ కు తరలించడం ....ఆమె ప్రాణాపాయం నుండి కోలుకోవడం జరిగింది కానీ.... ఇప్పటికి మూడుసార్లు సర్జరీలు చేసి ఆమె ప్రేవులు, మర్మావయవాన్ని సరి చేయడం జరిగింది. ఈ దుర్ఘటన జరిగి ఏడాది కావస్తున్నా యాంగ్ ఇంకా సాధారణ స్థితికి రాలేదు . సర్జరీలు కారణంగా ఆమె పొట్టమీద కత్తిగాట్లు గమనించారుగా!
ప్రపంచంలో ఎన్నో రకాల ప్రమాదాలు గురించి మీకు తెల్సి ఉండవచ్చు. ఇలాంటి ప్రమాదం గురించి మీరెక్కడైనా చదివారా. ఎప్పుడైనా విన్నారా ? విధి ఎంత విచిత్రమైనదో మానవజీవితాలలో ఎలా ఆడుకుంటుందో చూసారా ?
Sunday, March 4, 2012
Saturday, March 3, 2012
ప్రపంచలోనే అతి పెద్ద "జబ్బ"
14 సంవత్సరాల నుంచే Body builder అయిన "Greg Valentino" .... ఈ కీర్తిని సొంతం చేసుకున్నాడు . ఇక నేను ఎత్తు పెరిగేదిలేదు .ఎందుకంటే ఎత్తు పెరగడం అన్నది నా చేతుల్లో లేదు . అందుకని నేను అడ్డంగా నా శరీరాన్ని భారీగా పెంచుకోవాలనుకుంటున్నాను అని ప్రకటించి మరీ ..... Body builder గా తన కండరాలను బలంగా పెంచాడు .ఇతని జబ్బ చుట్టు కొలత ఎంతనుకున్నారు .... అక్షరాల 28 అంగుళాలు . నుయార్క్ కు చెందిన మన హీరో బరువు ..250 LB లు (113kg)
"ఐన్ స్టీన్" కు షాక్
ప్రఖ్యాత ఐన్ స్టీన్ ఒకరోజు షికారుకు వెళుతుంటే ఒక పేద కుర్రాడు కనిపించాడు. మొహం సరిగా కడుక్కోకుండా ఉన్న ఆ పిల్లాడిని నీళ్ళతో మొహం శుభ్రం చేసుకుని వస్తే డబ్బులిస్తానని ఐన్ స్టీన్ ఆశచూపారు. వెంటనే ఆ కుర్రాడు శుభ్రంగా కడుక్కుని వచ్చాడు. దాంతో ఆయన డబ్బులిచ్చి ఈ డబ్బుతో ఏమి చేస్తావ్ అని అడిగారు... మీ డబ్బు మీకే ఇద్దామనుకుంటున్నాను... అది మీకే అవసరం అన్నాడా బుడతడు. ఐన్ స్టీన్ ఆశ్చర్యపోతు దేనికి అన్నారు. మీ జుట్టు చూడండి.. దుబ్బులాగా ఎలా పెరిగిందో ... ఈ డబ్బుతో కట్ చేయించుకోండి అని తిరిగి డబ్బులిచ్చేసాడు. షాకవడం అంతపెద్ద సైంటిస్ట్ వంతయింది. ఐన్ స్టీన్ కు జుట్టు ఎక్కువగా ఉంటుంది.
1000 మంది కూర్చొనగల అతి పొడవైన బెంచ్
బెంచ్ లు పొడవుగానే, నలుగురు లేక ఐదుగురు కూర్చునేందుకు వీలుగా పార్కులలో ఉంటాయ్. కానీ ఏకంగా ఒకేసారి "1000" మందికి పైన జనం సర్దుకుని కుర్చోగల బెంచ్ (324-meter) ఒకటుందంటే నమ్మగలరా ? ఇది నిజం .వెస్ట్ ససెక్స్ కు చెందిన బ్లూఫ్లాగ్ బీచ్ లో ... ఈ బెంచ్ ను మీరు చూడవచ్చు .దృడమైన వుడ్ తో ఈ longest బెంచ్ ని "Studio Weave" అన్న british companie రూపొందించింది .
ప్రపంచంలోనే అతి పొట్టి "గుర్రం"
పొట్టి మనుషులు ,పొట్టి మొక్కలు మత్రమే కాదు ఈ భూమిమీద మరగుజ్జు గుర్రాలుకుడా ఉన్నాయ్ . horse రేసుల్లో పాల్గొని "The great winner", The fastest runner" కాలేకపోయినా -ఈ గుర్రానికి మాత్రం - రేస్ horse ల కన్నా మంచి పాపులారిటి ఉంది . దీని ఎత్తు 20 అంగుళాలు . దీనికి పెట్టబడిన పేరు einstein . ఒక విధంగా చెప్పాలంటే భోన్పాయ్ మొక్కల మాదిరి ఈ మర గుజ్జు horse కూడా మానవ సృష్టే .ఓ విధంగా ఇదో రకం హైబ్రీడ్ horse.
Friday, March 2, 2012
ప్లేట్ ఖాళీ చేయకపోతే పెనాల్టి తప్పదు!?
సౌది అరేబియాకు చెందిన కొన్ని రెస్టారెంట్స్ లలో ఈ మద్యనే ఓ సరికొత్త విధానాన్ని కొందరు రెస్టారెంట్ యజమానులు అమలులోకి తెచ్చారు. మీరు ఆర్డరిచ్చిన ఫుడ్ కనుక మీరు పూర్తిగా తినకుండా వదిలివేసినట్లయితే ... మీరు వదిలిన ఆహారానికి అనుగుణంగా మీరు రెస్టారెంట్ కు పెనాల్టి చెల్లించాల్సి వస్తుంది .
ఇలాంటి నిబంధన విధించడానికి కారణం .. . ఆహారం వేస్టేజ్ తగ్గించడానికి... కొందరు customers కు వారెంత తినగలరో వారికీ తెలియదు. ఒకేసారి భారీగా ఆర్డర్ ఇచ్చేస్తారు .తీరా తినలేక భారీగానే వదిలేస్తారు .కొందేరేమో luxury కోసం అన్నట్లు రకరకాల foods ఆర్డర్ చేసి ...అరకొర రుచి చూసినట్లు చూసేసి .... మిగిలింది వదిలేస్తుంటారు . ఇలా food భారీగా vest అవ్వడాన్ని అరికట్టడానికి ఈ పెనాల్టి విధానం అంటున్నారు రెస్టారెంట్ అధికారులు... ఈ విధానం గతంలో ఆస్ట్రేలియాలో , హాంకాంగ్ లో కూడా అమలుచేయబడి... ఆ తర్వాత ఈ పద్దతిని వారు తొలగించడం జరిగింది . ఈ idea మాత్రం చాలా విచిత్రంగా ఉంది కదూ!!
Wednesday, February 29, 2012
Tuesday, February 28, 2012
Monday, February 27, 2012
Sunday, February 26, 2012
Saturday, February 25, 2012
Friday, February 24, 2012
రోజుకి ఎప్పుడూ 24 గంటలేనా ?
మనం నివసిస్తున్న భూమి తన చుట్టూ తాను తిరగడానికి స్థూలంగా 24 గంటలు సమయం పడుతుందని, దీనినే మనం "రోజు" అంటున్నామని మీకు తెలుసు కదా. అదేవిదంగా భూమి ఒక నిర్దిష్ట కక్షలో సూర్యుని చుట్టూ, ఒక చుట్టు చుట్టి రావడానికి స్థూలంగా 365 1/4 రోజులు సమయం పడుతుందని, దీనినే "సంవత్సరం" అంటున్నామని కూడా మీకు తెలిసే ఉంటుంది. ప్రస్తుతం భూమి తన చుట్టూ తాను గంటకు 1000 మైళ్ళు వేగంతో తిరుగుతోంది. అయితే ఈ రెండు వేగాలూ భూమి పుట్టినప్పటి నుండి ఇలానే లేవు.
భూగోళం పుట్టి ఇప్పటికి సుమారు 456 కోట్ల సంవత్సరాలు అయినట్లుగా శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. అయితే అనేక అంశాలను ఆదారంగా చేసుకుని ఇప్పటికి సుమారు 53 కోట్ల ఏళ్ళ కిందట భూమి తన చుట్టూ తాను తిరిగేందుకు కేవలం 21 గంటల సమయాన్ని మాత్రమే తీ సుకునేదని, సూర్యుని చుట్టూ తిరిగేందుకు రమారమి 420 రోజులు సమయాన్ని తీ సుకునేదని శాస్త్రజ్ఞులు లెక్కించారు. అంతే కాదు, ఇప్పటికి మరో 50 కోట్ల సంవత్సరాల తరువాత భూమి తన చుట్టూ తాను తిరిగేందుకు కేవలం 300 రోజులు సమయాన్ని తీసుకుంటుందని కూడా శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. భూమి అత్మబ్రమణ వేగం ఇలా క్రమేణా తగ్గడానికి కారణం ఏమిటో తెలుసా? చంద్రుడి ఆకర్షణ శక్తి! ఆ ఆకర్షణ శక్తి వల్ల ఉత్పన్నమయ్యే ఘర్షణవల్లనే భుబ్రమణ వేగం ఇలా తగ్గుతూ వస్తోంది.
మీకు తెలుసో లేదో గాని ఒక 100 ఏళ్ల కిందట కన్నా ఇప్పుడు "రోజు" అనేది కొంచెం పెద్దగా మారింది. చిత్రంగా అనిపించినా ఇదినిజం.
దేశాలు - జాతీయక్రీడలు
ఆస్ట్రేలియా - క్రికెట్ భారత్ - హాకీ
జపాన్ - జూడో పాకిస్తాన్ - హాకీ
వెస్టిండీస్ - క్రికెట్ ఇండోనేషియా - బ్యాట్మింటన్
కెనడా - మంచు ఫై హాకీ స్కాట్లాండ్ - రగ్బీ
ఇంగ్లాండ్ - క్రికెట్ అమెరికా - బేస్ బాల్
చైనా -టేబుల్ టెన్నిస్
Thursday, February 23, 2012
కొమ్ములు , వెంట్రుకలు మృతకణాలు
గేదెలు ,ఆవులు కొమ్ములు వెంట్రుకలలో వుండే కేరాటిన్ అనే పదార్థం తో తయారవుతాయి. ఖడ్గమృగం కొమ్ములు కూడా అలాగే తయారవుతాయి. అలాగే జంతువుల గిట్టలు కూడా అటువంటి పదార్థంతోనే రూపొందుతుంది. అందుకే కొమ్ముల్ని కోసినా ఆయా జంతువులకు రక్తం రాదు. నొప్పి కలగదు. గుర్రం ,ఆవుల గిట్టలకు నాడాలు కొట్టినా వాటికీ రక్తం రాదు తెలుసుకదా.
ఈ కేరాటిన్ అనేది ఒక రకమైన ప్రోటిను. దానితో వెంట్రుకులే కాకుండా గోళ్ళు కూడా తయారవుతాయి. మనకు కూడా వెంట్రుకులు కత్తిరించినా, గోళ్ళు కత్తిరించినా నొప్పి ఉండదు. అందుకు కారణం అవి మృతకణజాలాలు. కాని అవి పెరుగుతూనే ఉంటాయి కదా అని అడుగుతున్నారా? వాటి మొదల్లలోనే పెరుగుదోల ఉంటుంది. ఎలాగంటే ఆ మొదళ్ళలో కణాలు చనిపోతే, వాటిని, వాటి కింద ఉన్న కొత్త కణాలు ముందుకు తోస్తాయి. అదే మనకు పెరిగినట్టు కనిపిస్తుంది.
Tuesday, February 21, 2012
Subscribe to:
Posts (Atom)