Friday, March 2, 2012

ప్లేట్ ఖాళీ చేయకపోతే పెనాల్టి తప్పదు!?


సౌది అరేబియాకు చెందిన కొన్ని రెస్టారెంట్స్ లలో ఈ మద్యనే ఓ సరికొత్త విధానాన్ని కొందరు రెస్టారెంట్ యజమానులు అమలులోకి తెచ్చారు. మీరు ఆర్డరిచ్చిన ఫుడ్ కనుక మీరు పూర్తిగా తినకుండా వదిలివేసినట్లయితే ... మీరు వదిలిన ఆహారానికి అనుగుణంగా మీరు రెస్టారెంట్ కు పెనాల్టి చెల్లించాల్సి వస్తుంది .
ఇలాంటి నిబంధన విధించడానికి  కారణం .. . ఆహారం వేస్టేజ్ తగ్గించడానికి... కొందరు customers కు వారెంత తినగలరో వారికీ  తెలియదు. ఒకేసారి భారీగా ఆర్డర్ ఇచ్చేస్తారు .తీరా తినలేక భారీగానే వదిలేస్తారు .కొందేరేమో luxury కోసం అన్నట్లు రకరకాల foods ఆర్డర్ చేసి ...అరకొర రుచి చూసినట్లు చూసేసి .... మిగిలింది వదిలేస్తుంటారు . ఇలా food భారీగా vest  అవ్వడాన్ని అరికట్టడానికి ఈ పెనాల్టి విధానం అంటున్నారు రెస్టారెంట్ అధికారులు... ఈ విధానం గతంలో ఆస్ట్రేలియాలో , హాంకాంగ్ లో కూడా అమలుచేయబడి... ఆ తర్వాత ఈ పద్దతిని వారు తొలగించడం జరిగింది . ఈ idea మాత్రం చాలా  విచిత్రంగా ఉంది  కదూ!!

No comments:

Post a Comment