అంతానేనే , అంతానాదే, నా గొప్పతనమే నా విజయాలకు కారణం అంటూ ... మీసాలు మెలివేసే ఎందరో ఒక్కటంటే ఒక్క దెబ్బ జీవితంలో గట్టిగా తగిలిందంటే చాలు.... వెంటనే వారి నోటివెంట వచ్చే పదం ’విధి’.
ఎంతటివారయినా.... ఆ విధిని తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. విధిరాత కాకపోతే .....అందంగా నీరు విరజిమ్ముతూ ....ఎందరినేత్రాలకో మహదానందాన్ని, ఎందరి మనసులలో మహోల్లాసాన్నిఅందించే అతిసాధారణ వాటర్ ఫౌంటైన్... ఓ ఆడపిల్ల జీవితాన్ని దుర్భర పరిస్థితిలోకి దొర్లించడం ఏమిటి? రేపు ఆమె వివాహానికి అర్హురాలా అన్నంతగా... ఆమె జీవితాన్ని కాలరాచిన ఈ వింత ఉదంతం మిమ్మల్ని తప్పకుండా ఆకర్షిస్తుంది. ఇక్కడి చిత్రంలో మీరు చూస్తున్నది ... చైనాకు చెందిన టియాన్ స్క్వేర్లోని వాటర్ ఫౌంటైన్ . ఎంత అందంగా ఉందో చూపరులకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో గమనించారుగా. ఈ స్విమ్మింగ్ ఫూల్ ఓ 19 సంవత్సరాల యువతి జీవితంలో నిప్పులు చెరిగింది.19 సంవత్సరాల ఆ యువతి పేరు యాంగ్. ఫ్రెండ్స్ తో కలిసి ఈ వాటర్ ఫౌంటెయిన్ ను ఎంజాయ్ చేస్తుంది. ఇది మ్యూజికల్ వాటర్ ఫౌంటెయిన్ కావడంతో ....ఎక్కువగా యువతి యువకులు ఇక్కడకు వస్తుంటారు. వాటర్ ఫౌంటెయిన్ లోకి దిగి ...సన్నగా నీటిని విరజిమ్ముతున్న ఫౌంటెయిన్ నీటి జల్లుల్లో చల్లగా తడుస్తూ ...హ్యాపీగా కేరింతలు కొడుతున్నారు ...... యాంగ్,ఆమె స్నేహితులు. హఠాత్తుగా కాళ్ళక్రింద భూమి బద్దలయిందా అన్నట్లుగా..... యాంగ్ కాళ్ళ క్రిందనున్న అతి పవర్ ఫుల్ ఫౌంటెయిన్ ఒక్కసారిగా నీరు విరజిమ్మడం .... ఆ వేగానికి యాంగ్ గాలిలోకి లేచి క్రిందపడిపోవడం జరిగింది.
ఏమి జరిగిందో అర్ధం చేసుకునేలో గానే పెద్ద అనర్దం జరిగిపోయింది. ఆమె శరీరం నుండి రక్తం ధారలుగా కారిపోతుంది. దీనికి కారణం ...యాంగ్ గాలిలోకి లేచి క్రింద పడిపోవడం కాదు. వాటర్ ఏకంగా ఆమె మర్మావయువం లోంచి ఆమె ప్రేగుల్లోకి దూసుకు వెళ్లాయ్. మర్మావయవం చినిగిపోయి ... ప్రేవులు కూడా డ్యామేజ్ కావడంతో ....రక్తం కాలువలు కట్టింది . తక్షణం హాస్పటల్ కు తరలించడం ....ఆమె ప్రాణాపాయం నుండి కోలుకోవడం జరిగింది కానీ.... ఇప్పటికి మూడుసార్లు సర్జరీలు చేసి ఆమె ప్రేవులు, మర్మావయవాన్ని సరి చేయడం జరిగింది. ఈ దుర్ఘటన జరిగి ఏడాది కావస్తున్నా యాంగ్ ఇంకా సాధారణ స్థితికి రాలేదు . సర్జరీలు కారణంగా ఆమె పొట్టమీద కత్తిగాట్లు గమనించారుగా!
ప్రపంచంలో ఎన్నో రకాల ప్రమాదాలు గురించి మీకు తెల్సి ఉండవచ్చు. ఇలాంటి ప్రమాదం గురించి మీరెక్కడైనా చదివారా. ఎప్పుడైనా విన్నారా ? విధి ఎంత విచిత్రమైనదో మానవజీవితాలలో ఎలా ఆడుకుంటుందో చూసారా ?
No comments:
Post a Comment