Friday, February 24, 2012

రోజుకి ఎప్పుడూ 24 గంటలేనా ?


మనం నివసిస్తున్న భూమి తన చుట్టూ తాను తిరగడానికి స్థూలంగా 24 గంటలు సమయం పడుతుందని, దీనినే మనం "రోజు" అంటున్నామని మీకు తెలుసు కదా. అదేవిదంగా భూమి ఒక నిర్దిష్ట కక్షలో సూర్యుని చుట్టూ,  ఒక చుట్టు చుట్టి రావడానికి స్థూలంగా 365 1/4  రోజులు సమయం పడుతుందని, దీనినే "సంవత్సరం" అంటున్నామని కూడా మీకు తెలిసే ఉంటుంది. ప్రస్తుతం భూమి తన చుట్టూ తాను గంటకు 1000  మైళ్ళు వేగంతో  తిరుగుతోంది. అయితే ఈ రెండు వేగాలూ భూమి పుట్టినప్పటి నుండి ఇలానే లేవు.
భూగోళం పుట్టి ఇప్పటికి సుమారు 456 కోట్ల  సంవత్సరాలు అయినట్లుగా శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. అయితే అనేక అంశాలను ఆదారంగా చేసుకుని  ఇప్పటికి సుమారు 53 కోట్ల ఏళ్ళ కిందట భూమి తన చుట్టూ తాను తిరిగేందుకు కేవలం 21 గంటల సమయాన్ని మాత్రమే  తీ సుకునేదని, సూర్యుని చుట్టూ తిరిగేందుకు రమారమి 420 రోజులు సమయాన్ని తీ సుకునేదని  శాస్త్రజ్ఞులు లెక్కించారు. అంతే కాదు, ఇప్పటికి మరో 50 కోట్ల సంవత్సరాల తరువాత భూమి తన చుట్టూ తాను తిరిగేందుకు కేవలం 300 రోజులు సమయాన్ని తీసుకుంటుందని కూడా శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. భూమి అత్మబ్రమణ వేగం ఇలా క్రమేణా తగ్గడానికి కారణం ఏమిటో తెలుసా? చంద్రుడి ఆకర్షణ శక్తి!  ఆ ఆకర్షణ శక్తి వల్ల ఉత్పన్నమయ్యే ఘర్షణవల్లనే  భుబ్రమణ వేగం ఇలా తగ్గుతూ వస్తోంది.
మీకు తెలుసో లేదో గాని ఒక 100 ఏళ్ల కిందట కన్నా ఇప్పుడు "రోజు" అనేది కొంచెం పెద్దగా మారింది. చిత్రంగా అనిపించినా ఇదినిజం.

దేశాలు - జాతీయక్రీడలు

ఆస్ట్రేలియా - క్రికెట్         భారత్ - హాకీ
 
జపాన్ -    జూడో             పాకిస్తాన్ -  హాకీ 

వెస్టిండీస్ -    క్రికెట్                  ఇండోనేషియా - బ్యాట్మింటన్ 

కెనడా -    మంచు ఫై హాకీ         స్కాట్లాండ్ - రగ్బీ 

ఇంగ్లాండ్ - క్రికెట్                      అమెరికా -   బేస్ బాల్ 


చైనా      -టేబుల్ టెన్నిస్ 

Thursday, February 23, 2012

కొమ్ములు , వెంట్రుకలు మృతకణాలు


గేదెలు ,ఆవులు కొమ్ములు వెంట్రుకలలో వుండే కేరాటిన్ అనే పదార్థం తో తయారవుతాయి.  ఖడ్గమృగం కొమ్ములు కూడా అలాగే తయారవుతాయి. అలాగే జంతువుల గిట్టలు కూడా అటువంటి పదార్థంతోనే రూపొందుతుంది.  అందుకే కొమ్ముల్ని కోసినా ఆయా జంతువులకు రక్తం రాదు. నొప్పి కలగదు. గుర్రం ,ఆవుల గిట్టలకు నాడాలు కొట్టినా  వాటికీ రక్తం రాదు తెలుసుకదా.

ఈ కేరాటిన్ అనేది ఒక రకమైన ప్రోటిను. దానితో వెంట్రుకులే కాకుండా గోళ్ళు కూడా తయారవుతాయి. మనకు కూడా  వెంట్రుకులు కత్తిరించినా, గోళ్ళు కత్తిరించినా నొప్పి ఉండదు. అందుకు కారణం అవి మృతకణజాలాలు.  కాని అవి పెరుగుతూనే ఉంటాయి కదా అని అడుగుతున్నారా? వాటి మొదల్లలోనే పెరుగుదోల ఉంటుంది.  ఎలాగంటే ఆ మొదళ్ళలో కణాలు చనిపోతే, వాటిని, వాటి కింద ఉన్న కొత్త కణాలు ముందుకు తోస్తాయి. అదే మనకు పెరిగినట్టు కనిపిస్తుంది.

Excel లో "CONCATENETE" function ఉపయోగించడం ఎలా ?