Thursday, February 23, 2012

కొమ్ములు , వెంట్రుకలు మృతకణాలు


గేదెలు ,ఆవులు కొమ్ములు వెంట్రుకలలో వుండే కేరాటిన్ అనే పదార్థం తో తయారవుతాయి.  ఖడ్గమృగం కొమ్ములు కూడా అలాగే తయారవుతాయి. అలాగే జంతువుల గిట్టలు కూడా అటువంటి పదార్థంతోనే రూపొందుతుంది.  అందుకే కొమ్ముల్ని కోసినా ఆయా జంతువులకు రక్తం రాదు. నొప్పి కలగదు. గుర్రం ,ఆవుల గిట్టలకు నాడాలు కొట్టినా  వాటికీ రక్తం రాదు తెలుసుకదా.

ఈ కేరాటిన్ అనేది ఒక రకమైన ప్రోటిను. దానితో వెంట్రుకులే కాకుండా గోళ్ళు కూడా తయారవుతాయి. మనకు కూడా  వెంట్రుకులు కత్తిరించినా, గోళ్ళు కత్తిరించినా నొప్పి ఉండదు. అందుకు కారణం అవి మృతకణజాలాలు.  కాని అవి పెరుగుతూనే ఉంటాయి కదా అని అడుగుతున్నారా? వాటి మొదల్లలోనే పెరుగుదోల ఉంటుంది.  ఎలాగంటే ఆ మొదళ్ళలో కణాలు చనిపోతే, వాటిని, వాటి కింద ఉన్న కొత్త కణాలు ముందుకు తోస్తాయి. అదే మనకు పెరిగినట్టు కనిపిస్తుంది.

No comments:

Post a Comment