కేంద్రప్రభుత్వం ప్రారంభించిన Website ఖోయా పాయా http://khoyapaya.gov.in/mpp/home వెబ్ సైట్ కనిపించకుండా పోయిన పిల్లల ఆచూకీ కనిగొనడానికి ఎంతగానో సహాయపడుతుంది. అదృశ్యమైన పిల్లల తల్లిదండ్రులు తమ వివరాలు ఈ వెబ్ సైట్ లో నమోదు చేయవచ్చు.. కేవలం పిల్లల తల్లిదండ్రులు మాత్రమే ఈ వెబ్సైట్ సేవలు వినియోగించుకోవాలనే నియమం ఏమీలేదు.. కనిపించకుండా పోయిన పిల్లల బందువులూ శ్రేయోభిలాషులూ స్నేహితులూ కూడా ఆ పిల్లల వివరాలను నమోదు చేయొచ్చు. అంతే కాకుండా బయట మీకెవరైనా తప్పిపోయిన పిల్లలు కనిపించినా దారి తెలియక ఇబ్బంది పడుతున్న పిల్లలు కనిపించినా వారి వివరాలు కూడా మీరు నమోదు చేయొచ్చు.
ఎలా చేయాలంటే….
పిల్లలు కనిపించకుండా పోయినపుడు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తరువాత ఈ వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేసుకోవాలి. దీనిలో లాగిన్ అయిన వెంటనే సెల్ ఫోన్ నెంబర్ తప్పనిసరిగా రాయాలి. నంబర్ ఇవ్వగానే మన సెల్ కు వన్ టైం పాస్వర్డ్ వస్తుంది(ఓ.టి.పి.). తరువాత మిగతా వివరాలు పూర్తి చేసినా కూడా ఈ ఓటీపీ నెంబర్ ను నమోదు చేసిన వారు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. లేదా సేవ్ ఛేసుకోవాలి
ఆచూకీ తెలియకుండా పోయిన అబ్బాయి లేదా అమ్మాయి పూర్తి పేరు, చిరునామా తో సహా పూర్తి వివరాలు నమోదు చేయాలి. ఎంత ఎక్కువ సమాచారం ఇవ్వగలిగితే అంత మంచిది.. అదృశ్యం కావడానికి ముందు ఏం దుస్తులు వేసుకున్నారో ఏ కలర్ దుస్తులు ధరించారో మరియు వారి అలవాట్లూ అభిరుచులూ మొదలైన వివరాలు కూడా ఇవ్వవచ్చు.. అభిరుచులు అంత ముఖ్యం కాదని అనుకుంటారు. కానీ ఆ చిన్న సమాచారమే ఎన్నోసార్లు వారి ఆచూకీ ని పట్టి ఇచ్చిన సంధర్భాలున్నాయి..
నాన్న కొట్టాడనే కోపం లో చెన్నై లో ఒక కుర్రాడు తనకెంతో ఇష్టమైన కారు బొమ్మ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి తల్లి దండ్రులు ఈ విషయాన్నికూడా మర్చిపోకుండా చెప్పడంతో అతనిని వెదికి పట్టుకోడంలో ఆ వివరాలు ఎంతో తోడ్పడ్డాయి.
అయితే ఈ వెబ్ సైట్ విషయం లో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ వెబ్సైట్ లోని సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయడం గానీ ఏదైనా అప్లోడ్ చేయడం చేయకూడదు. పిల్లలు తప్పిపోయినపుడు తల్లిదండ్రులు ఏం చేయాలో ఇందులో వివరంగా రాసారు. అలాగే పిల్లల ఆచూకీ తెలిసి ఇంటికి వచ్చాక తిట్టడం, కొట్టడం వంటివి చేయకుండా ఎలా ఆప్యాయంగా ప్రేమ గా చూసుకోవాలి. అనే విషయాలు కూడా వివరం గా రాసారు. ఎవరైనా రోడ్ల మీద పిల్లలు తచ్చాడుతూ కనిపిస్తే సహాయం అందించవచ్చో సూచించారు.
ఒక సమస్యను పరిష్కరించడానికి ఒకటి కాకపోతే పది రకాలు గా ప్రయత్నించి చూడటం మంచిది కదా.. ఇది కూడా అలాంటి ప్రయత్నమే అనుకోండి. ఒకవేళ ఉపయోగపడితే సమస్య తీరుతుంది. లేదంటే లేదు.. ఫ్రయత్నించి చూడటంలో తప్పు లేదు…..
ఇంత ముఖ్యమైన సమాచారాన్ని మీ మిత్రులతో పంచుకోవడం మర్చిపోకండి..
No comments:
Post a Comment