Tuesday, November 26, 2013

PAN అంటే ఏమిటి? PAN కలిగివుండవలసిన అవసరం ఏమిటి?

PAN అంటే ఏమిటి?

ఆదాయంపన్ను శాఖ (Incom tax Department ) , మీ ఖాతాకు శాశ్వతంగా కేటాయించే సంఖ్యను ( Permenent Account Number) పాన్ అంటారు. ఇది అంకెలు, అక్షరాలతో కూడిన పది స్థానాల సంఖ్య. ఈ సంఖ్యను లామినేట్ చేసిన కార్డుపై ముద్రించి ఆదాయంపన్ను శాఖ అందజేస్తుంది. ఉదాహరణకు పాన్ ఇలాఉంటుంది. AABPS1205E.

PAN కలిగివుండవలసిన అవసరం ఏమిటి?

ఆదాయంపన్నును ప్రకటించే పత్రాలలో (Return) , ఆ శాఖకుచెందిన ఏ అధికారితోనైనా జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలలో పాన్ ను పేర్కొనడం తప్పనిసరి. 2005 జనవరి నుంచి, ఆదాయంపన్ను శాఖకు చెల్లించవలసిన అన్ని చలాన్లపైన పాన్ పేర్కొనడం తప్పనిసరిచేశారు. {సెక్షన్ 139 ఏ (5) (ఏ) (బి) మరియు (బి)} Central Board for direct Taxes) (CBDT) ఎప్పటికప్పుడు ప్రకటించే, ఆర్ధికలావాదేవీలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలలోకూడా PAN ను విధిగా పేర్కొనాలి. స్థిర ఆస్తులు లేదా వాహనాల కొనుగోలు, లేదా హోటళ్ళు, రెస్టారెంట్‌లకు 25,000/- రూపాయలకు పైబడి చేసే చెల్లింపులు, లేదా విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ఆర్ద్కిక లావాదేవీల వంటివి ఈ కోవలోకి వస్తాయి. టెలిఫోన్ లేదా సెల్‌ఫోన్ కనెక్షన్ పొందాలన్నా పాన్ ను పేర్కొనడం తప్పనిసరి. బ్యాంకులో లేదా పోస్టాఫీసులో 50,000 రూపాయలకు పైబడిన కాలపరిమితి డిపాజిట్లకు చెల్లించాలన్నా, బ్యాంకులో 50,000 రూపాయలు, అంతకు మించి నగదు చెల్లించాలన్నా కూడా పాన్ నంబర్‌ను పేర్కొని తీరాలి. { సెక్షన్ 139 ఏ (5) 114 బి నిబంధనతో కలిపి చదువుకోవాలి }

No comments:

Post a Comment