మొబైల్‌లో Copy చేసుకున్న సమాచారం Laptop లో, Laptop లో కాపీ చేసుకున్న సమాచారం ట్యాబ్‌లో... ఇలా Text ని సులభంగా Access చెయ్యడానికి www.ssavr.com/ వెబ్‌సైట్ Use అవుతుంది . అయితే మొబైల్, ల్యాపీ, ట్యాబ్ ఒకే వైఫై నెట్‌వర్క్ పరిధిలో ఉండాల్సి ఉంటుంది. మీ మొబైల్‌లో ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసి అందులో ‘Start Typing!’ బాక్స్‌లో మీరు విషయాన్ని టైప్ చేసుకోవచ్చు లేదా కాపీ చేయాలనుకున్న సమాచారాన్ని పేస్ట్ చేయొచ్చు. ఆ తర్వాత మీ ట్యాబ్, ల్యాపీలో అదే వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే మీరు ‘Typing’ బాక్సులో ఉంచిన సమాచారం పేస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది.
Monday, May 8, 2017
సమాచారాన్ని ప్రింట్ తీసుకోవాలా????
కొన్ని Websites ని Open చేసినప్పుడు అందులో ఉన్న మనకు కావలసిన Matter ని మనకు కావలసిన విధంగా Print తీసుకోవాలంటే అనవసర సమాచారం, ప్రకటనలు, ఇమేజ్‌లు కూడా ప్రింట్ అవుతాయి. అయితే printfriendly.com Website లోకి వెళ్లండి. అక్కడ Search box లో మీకు కావల్సిన సమాచారం ఉన్న లింక్‌ను ఎంటర్ చేయండి. వెంటనే ఆ వెబ్‌సైట్‌లోని సమాచారం అక్కడ ప్రత్యక్షమవుతుంది. అందులో మీకు అవసరం లేని సమాచారం, ఇమేజ్ లాంటి వాటి మీద మౌస్ కర్సర్ పెడితే డిలీట్ ఆప్షన్ వస్తుంది. దాంతో మీకు అవసరం లేని సమాచారాన్ని తొలగించుకోవచ్చు. ఆ తర్వాత మిగిలిన సమాచారాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. దాన్నే PDFగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Send notes that will self-destruct after being read.
ATM Pin , Bank account , Online Passwords, ... ఇలాంటి వాటిని ఎవరికైనా మెసేజ్ చేసినప్పుడు వారు చూసిన తరువాత , దానికదే క్లోజ్ అయ్యేలా, ఎలా పంపాలో చూద్దాం . దీనికోసం privnote.com వెబ్‌సైట్ మనకు బాగా ఉపయోగపడుతుంది . ఇందులో మీరు పంపాల్సిన విషయాన్ని రాయండి... ఆ తర్వాత అది వెబ్‌సైట్ లింక్‌లా కన్వర్ట్ అవుతుంది. దాన్ని మీరు అవతలి వ్యక్తికి పంపించండి. దాన్ని క్లిక్ చేసి మెసేజ్ చదవగానే... ఆ లింక్ ఆటోమేటిక్‌గా మూతపడిపోతుంది. అంటే మళ్లీ ఆ లింక్‌ను క్లిక్ చేస్తే మీకు ఎలాంటి సమాచారం కనిపించదన్నమాట.
Subscribe to:
Posts (Atom)